Sunday, 08 February 2026 10:11:12 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

వయనాడ్‌లో 133కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా దొరకని వందల మంది ఆచూకీ.. సహాయక చర్యల్లో ఆర్మీకి చెందిన శునకాలు

Date : 31 July 2024 10:22 AM Views : 400

Studio18 News - జాతీయం / : Kerala Landslide : వయనాడ్ లో ప్రకృతి కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో వంద మందికిపైగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయక చర్యల్లో వేగం పెంచినాకొద్ది మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 126కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో 133 మంది వరకు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 100 మంది ఆచూకీ లభించలేదు. వారికోసం శిథిలాల కింద వెతుకులాట కొనసాగుతుంది. మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలను వినియోగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా నాలుగు గ్రామాలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని మేపద్ది, ముండక్కై, చురల్‌మల, అత్తమాల, నూల్‌పుజా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నివాసాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. మరోవైపు వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికితోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. మండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాపీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. అక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పని చేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటున్నారు. వీరంతా గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేరళలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాలు ఉన్నాయి. వచ్చే 24గంటలు ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు ఇవాళ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :