Wednesday, 25 June 2025 06:52:15 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

హస్తిన వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ఆగస్టులో రికార్డు

Date : 23 August 2024 12:55 PM Views : 121

Studio18 News - జాతీయం / : Delhi highest number of rainy days: కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీలో పదేళ్ల తరువాత ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదయినట్టు వెల్లడించింది. ఆగస్టు 22 నాటికి ఢిల్లీలో 266.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ప్రకటించింది. 2013 ఆగస్టులో 321 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే రానున్న వారం రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించడంతో ఈ నెలలో మరింత వర్షపాతం నమోదుకానుంది. 1961 ఆగస్టులో రికార్డు స్థాయిలో 583.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం 2012 ఆగస్టులో ఢిల్లీలో మొత్తం 22 రోజులు వర్షం పడింది. ఈ ఏడాది ఈ రికార్డును అధిగమించే అవకాశం కనబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈనెల 22 రోజుల్లో 20 రోజులు వర్షం కురిసింది. ఈ ఆగస్టులో ఎక్కువ రెయినీ డేస్ రికార్డు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా, 2012 ఆగస్టులో 378 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శుక్రవారం ఢిల్లీలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈసారి మాన్‌సూన్‌ సీజ‌న్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్) ఇప్పటివరకు ఢిల్లీలో 717 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2021 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీలో నాలుగు నెలల సగటు వర్షపాతం 640.4 మిల్లీమీటర్లగా ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :