Studio18 News - జాతీయం / : చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ ఓ 17 ఏళ్ల బాలుడు చివరకు ఆమెపై వేధింపులకు దిగాడు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలుడి ఆట కట్టించారు. టీచర్ తనను దూరం పెట్టిందనే కోపంతో బాలుడు వినూత్న వేధింపులకు దిగాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబెర్ రైడ్లు బుక్ చేశాడు. తమ ఇంటికి వరుసపెట్టి వస్తున్న డెలివరీ ఏజెంట్లు, డ్రైవర్లకు సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ- మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రౌటర్లను సీజ్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా నిందితుడి మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Admin
Studio18 News