Tuesday, 03 December 2024 05:13:18 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ... స్పందించిన అజిత్ పవార్

భాగస్వామ్య పార్టీలు కలిసి సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటాయన్న పవార్ కూటమి పార్టీలు తమ తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు చెప్పిన అజిత్ పవార్ శాసన సభా పక్ష నేతల

Date : 25 November 2024 03:30 PM Views : 45

Studio18 News - జాతీయం / : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మద్దతు పలికారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం పదవి రేసులో ఫడ్నవీస్ ముందున్నారు. సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి సీఎం పదవి రావాలని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అంశంపై అజిత్ పవార్ స్పందించారు. భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా తనను తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఎన్నికైనట్లు తెలిపారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు. మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి ఆ తర్వాత 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 సీట్లు అవసరం.

Also Read : వచ్చే నెల రెండు ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :