Thursday, 05 December 2024 03:28:12 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు

Date : 30 July 2024 02:57 PM Views : 38

Studio18 News - జాతీయం / : Wayanad Landslide : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వందలాది మంది ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడి ముండకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఇదిలాఉంటే.. అర్థరాత్రి వేళ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఫోన్లు విపరీతంగా మోగినట్లు గుర్తించారు. ఫోన్ సంభాషణలు.. బాధితుల ఆక్రందనలను స్థానిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. తమను కాపాడాలంటూ ఫోన్ ల ద్వారా స్థానికులు వేడుకున్నారు. చురల్మల ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి.. ఇల్లు మొత్తం శిథిలాల్లో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు ఉంది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ కాపాడండి అంటూ వేడుకుంది. పలువురు అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి తమ కాపాడాలని వేడుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా.. రేపు వయనాడ్ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వెళ్లనున్నారు. వయనాడ్ కొండచరియల విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల్లో 225 మంది ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. వాయనాడ్ జిల్లాలోని విపత్తు ప్రదేశంలో కీలకమైన చురల్మల వద్దనున్న వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయితే, కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోనుచూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ వీడియోలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు, చెట్లు ధ్వంసమయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :