Studio18 News - జాతీయం / : Siddheshwar Nath Temple : బీహార్ రాష్ట్రంలోని జెహానాబాద్ జిల్లా ముగ్ధంపూర్ లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా మంది స్థానిక ముగ్దంపూర్ ఆసుపత్రి, జెహనాబాద్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు.
Admin
Studio18 News