Monday, 16 September 2024 05:44:53 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Home » National » Shashi Tharoor On Sheikh Hasina In India బంగ్లాదేశ్‌లో హింస వేళ షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వకపోయి ఉంటే..: శశి థరూర్

Date : 12 August 2024 05:40 PM Views : 46

Studio18 News - జాతీయం / : Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల వల్ల ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇచ్చినందుకు కేంద్రాన్ని ప్రశంసించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆమెకు భారత్ సాయం చేయకపోతే అది మన దేశానికే అవమానకరమని చెప్పారు. మన మిత్రులతో మనం చెడుగా ప్రవర్తిస్తే ఇకపై ఎవరూ మనకు మిత్రులు కావాలని కోరుకోరని షేక్ హసీనా చెప్పారు. షేక్ హసీనా భారత్‌కు మిత్రురాలని తెలిపారు. మిత్రులు ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసే విషయంలో మరో ఆలోచనలేవీ పెట్టుకోవద్దని చెప్పారు. ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి, భద్రత కల్పించి భారత ప్రభుత్వం సరైన పని చేసిందని అన్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి భారతదేశానికి కూడా మొదట ఆందోళన కలిగించదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌తో ఆ దేశ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శశి థరూర్ తన అభిప్రాయాలు తెలిపారు. బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు కొనసాగించడానికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మొదటి నుంచి మద్దతుగా భారత్ బంగ్లాదేశ్‌కు భారత్ మొదటి నుంచి మద్దతు తెలుపుతోందని, 1971 యుద్ధం సమయంలోనూ మద్దతు తెలిపామని అన్నారు. కొన్ని సార్లు బంగ్లాదేశ్‌లో భారత స్నేహపూర్వక ప్రభుత్వం లేకపోయినప్పటికీ మనం మాత్రం సత్సంబంధాలను కొనసాగించామని తెలిపారు. రాబోయే కాలంలోనూ ఈ బంధాన్ని కొనసాగించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండబోవని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శశి థరూర్ అన్నారు. తనకు వ్యక్తిగతంగా మహమ్మద్ యూనస్ తెలుసని తెలిపారు. ఆయన అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని, ఆయన జమాత్ ఇ ఇస్లామీ, పాకిస్థానీ ఐఎస్‌ఐతో సత్సంబంధాలు కొనసాగించడం కంటే అమెరికాతో సత్సంబంధాలకే కాస్త మొగ్గు చూపుతారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :