Thursday, 12 March 2026 04:06:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Karnataka: కళ్ల ముందే అమ్మకు యాక్సిడెంట్.. ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి!

Date : 09 September 2024 03:27 PM Views : 414

Studio18 News - జాతీయం / : కళ్ల ముందే కన్నతల్లికి ప్రమాదం జరిగితే ఓ బాలిక చాకచక్యంగా వ్యవహరించింది. ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు తన చిన్ని చేతులతో ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా తోడవడంతో తల్లిని బయటకు తీసిందా బాలిక.. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదం కిన్నిగోళి రామనగర్ లో చోటుచేసుకుందని తెలుస్తోంది. రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించిందో తల్లి.. రోడ్డు మధ్యలోకి వచ్చాక దూసుకొస్తున్న ఆటోను గమనించింది. దీంతో రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టింది. చివరి క్షణంలో మహిళను గమనించిన ఆటో డ్రైవర్ ఆమెను తప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆటో వేగంగా వెళుతుండడంతో బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు. దీంతో హ్యాండిల్ ను పక్కకు తిప్పి మహిళను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు. అతి వేగం కారణంగా ఆటో సదరు మహిళను ఢీ కొట్టి బోల్తా పడింది. ఆటో మీద పడడంతో మహిళ కేకలు పెట్టింది. ఇదంతా చూసి షాక్ కు గురైన బాలిక.. క్షణాలలో తేరుకుంది. అమ్మను కాపాడుకోవడానికి పరుగెత్తుకెళ్లి ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆటోలో ఉన్న ప్రయాణికులు బయటపడి బాలికకు సాయం చేశారు. ఆటోను పైకి లేపి మహిళను కూర్చోబెట్టారు. గాయాలపాలైన మహిళను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :