Studio18 News - జాతీయం / : Bus Loses Control in Bengaluru : బెంగళూరులో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ బస్సు డ్రైవర్ ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో బస్సు వాహనాలపైకి దూసుకెళ్తున్నప్పటికీ డ్రైవర్ అలాగే చూస్తుండిపోవటం కనిపించింది. బస్సులో పక్కనే ఉన్న కండెక్టర్ డ్రైవర్ ను అలర్ట్ చేస్తేగానీ అక్కడ ఏం జరిగిందో బస్సు నడిపే డ్రైవర్ కు అర్థకాలేదు. ఈ ఘటన బెంగళూరులోని హెబ్బాల్ ప్లే ఓవర్ సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ వోల్వో బస్సు హెబ్బాళ్ ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి పలు బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన బస్సు లోపల అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. ఓ వంతెనపైన వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలో వోల్వో బస్సు కూడా నెమ్మదిగా కదులుతుంది. ఉన్నట్లుండి బస్సు వేగం ఒక్కసారిగా పెరగడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. బస్సు బ్రేక్ ను తొక్కడానికి ప్రయత్నించాడు. అయితే, బస్సు అప్పటికే ఆగిఉన్న మూడు బైకులను ఢీకొట్టింది. ఆ తరువాత కార్లను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, బస్ కండక్టర్ డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి బ్రేకులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనలో బస్సు ముందు భాగంలో అద్దంసైతం పలిగింది. ఈ ఘటనపై డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
Admin
Studio18 News