Wednesday, 16 July 2025 10:34:04 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఢిల్లీలో విమానానికి తప్పిన ముప్పు.. ల్యాండింగ్‌కు ముందు తీవ్ర కుదుపులు, ప్రయాణికుల ఆర్తనాదాలు.. వీడియో ఇదిగో!

Date : 02 June 2025 11:51 AM Views : 50

Studio18 News - జాతీయం / : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో, ఇండిగోకు చెందిన ఓ విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేశాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాయ్‌పూర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానం 6ఈ 6313 ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం నేలను తాకే సమయంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరడంతో విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ సురక్షితం కాదని భావించి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానం లోపల ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కిటికీ నుంచి చూస్తే బయట ఏమీ కనిపించనంతగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5:05 గంటలకు ల్యాండ్ కావాల్సిన విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం 5:43 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు. ఢిల్లీలో వాతావరణ బీభత్సం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆగ్నేయ దిశగా కదులుతున్న మేఘాల సమూహం వల్లే ఈ వాతావరణ మార్పులు సంభవించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశ రాజధాని దక్షిణ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, కొన్నిచోట్ల గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాయని పేర్కొంది. విమానాశ్రయం ఉన్న పాలం ప్రాంతంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లుగా నమోదైంది. ప్రగతి మైదాన్‌లో గాలి వేగం గంటకు 76 కిలోమీటర్లకు చేరింది. వివిధ వాతావరణ వ్యవస్థల కలయిక వల్లే ఈ ఆకస్మిక మార్పులు సంభవించాయని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర పాకిస్థాన్‌పై మధ్య ట్రోపోస్పియర్‌ వాతావరణంలో ఏర్పడిన పశ్చిమ అలజడి, హర్యానాపై దిగువ స్థాయిలో ఏర్పడిన మరో తుఫాను తరహా వాయు ప్రసరణ, అరేబియా సముద్రం నుంచి నిరంతరంగా తేమ వంటి అంశాలు ఈ తుఫాను వాతావరణానికి కారణమయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఢిల్లీలో నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :