Studio18 News - జాతీయం / : popular global leaders in 2024 : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన 25 మంది నేతల జాబితాను రూపొందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 69శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెలువడిన జాబితాలో మోదీ తరువాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవీయర్ మిలి, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్ అమ్హెర్డ్, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ నిలిచారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39శాతం మంది మద్దతు మాత్రమే లభించింది. ఒక చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియొ కిషిద నిలిచారు. ఆసక్తికర విషయం ఏమిటంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన యూకే ప్రధాని కైర్ స్టార్మర్, మాజీ పీఎం రిషి సునక్ స్థానంలో గ్లోబల్ పాపులర్ లీడర్ల టాప్ -10 లిస్ట్ లో చోటు సంపాదించారు. టాప్ 10 దేశాధినేతలు వీరే.. నరేంద్ర మోదీ (భారత్): 69శాతం ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో అధ్యక్షుడు) : 63శాతం జేవియర్ మిలి (అర్జెటీనా అధ్యక్షుడు) : 60శాతం వియోలా అమ్హెర్డ్ (స్విట్టర్లాండ్ అధ్యక్షుడు) : 52శాతం సైమన్ హారిస్ (ఐర్లాండ్ ప్రధాని) : 47శాతం కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని) : 45శాతం డొనాల్డ్ టస్క్ (పోలండ్ ప్రధాని) : 45శాతం ఆంథోనీ అల్బనీస్ (ఆస్ట్రేలియా ప్రధాని) : 42శాతం పెడ్రో సాంచెజ్ (స్పెయిన్ ప్రధాని) : 40శాతం జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని) : 40శాతం
Admin
Studio18 News