Saturday, 17 January 2026 10:10:57 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Delimitation: తెలంగాణకు అర్ధ రూపాయి.. బీహార్ కేమో ఆరు రూపాయలా?: రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగిస్తోందని ఆరోపణ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఫైర

Date : 22 March 2025 03:11 PM Views : 318

Studio18 News - జాతీయం / : కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తోందని, తిరిగి పొందుతున్నది మాత్రం స్వల్పమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే, కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తోందని విమర్శించారు. అదే బీహార్ కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తోందని చెప్పారు. ఈమేరకు శనివారం చెన్నైలో స్టాలిన్ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పన్నుల చెల్లింపు విషయంలో తెలంగాణతో పాటు తమిళనాడు (రూపాయికి 26 పైసలు), కర్ణాటకకు (రూపాయికి 16 పైసలు) మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కు (రూపాయికి రూ. 2.03), మధ్యప్రదేశ్ కు (రూపాయికి రూ.1.73) అందుతున్నాయని తెలిపారు. ‘తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం. తెలంగాణలో సుపరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధిలో రాణిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు చేటు చేస్తాయి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కు తెలంగాణ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విధానంలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డీలిమిటేషన్ పేరుతో లోక్ సభ సీట్లు పెంచవద్దని, సీట్ల పెంపుతో సంబంధంలేకుండా అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1976 లో కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ జరిపారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :