Studio18 News - జాతీయం / : Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్యాలియర్ లో విషాధ ఘటన చోటు చేసుకుంది. భార్య డబ్బులను అతిగా ఖర్చు చేస్తుండటంతో భర్త తట్టుకోలేక పోయాడు. అయితే, చివరికి పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాల్లోకి వెళితే.. 2017 సంవత్సరంలో గ్యాలియర్ లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్న సమయంలో అజయ్, ముస్కాన్ లకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులకే వారి విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు దూరమయ్యారు. కొద్దికాలానికి ఇద్దరికి వేరేవేరే వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లి జరిగిన ఏడాదికే అజయ్, అతని భార్యకు మనస్పర్థలు వచ్చాయి. ఇరువురి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా వారు కలిసి జీవనం సాగించేందుకు ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారు. అదే సమయంలో ముస్కాన్ కూడా తన భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో కలిసి జీవించలేమని భావించి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె గ్వాలియర్ కు తిరిగి వచ్చింది. మునుపటి పరిచయంతో అజయ్, ముస్కాన్ లు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. 2023లో కుటుంబ సభ్యుల అనుమతితో వారు పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలంకే ముస్కాన్ తీరుపట్ల అజయ్ విసిగిపోయాడు. ముస్కాన్ స్థాయికిమించి విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తుండటంతో పలుసార్లు అజయ్ మందలించాడు. అయినా ముస్కాన్ భర్త మాటలను పట్టించుకోకుండా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని అజయ్ భావించారు. దీనికి పక్కా ప్లాన్ అమలు చేశాడు. భార్యను చంపేందుకు కిరాయి హంతకుడితో రూ. 2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ముస్కాన్ స్కూటీపై గుడికి వెళ్లి వస్తుంది. ఇదే సమయంలో ఆమెను వాహనం బలంగా ఢీకొట్టింది. తొలుత పోలీసులు హిట్ అండ్ రన్ గా భావించినప్పటికీ.. దానిని యాక్సిడెంట్ గా భర్త అజయ్ చిత్రీకరించాడు. సిసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులకు అజయ్ మాటలపై అనుమానం ఏర్పడింది. దీంతో అజయ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్య అతిగా డబ్బులు ఖర్చు చేస్తుండటాన్ని తట్టుకోలేకనే హత్య చేయించానని చెప్పాడు.
Admin
Studio18 News