Studio18 News - జాతీయం / : సీనియర్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా క్యాడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాండేని ఆర్ధిక శాఖ కార్యదర్శిగా నియామకాన్ని కేబినెట్ నియామక కమిటీ ఆమోదించిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఉన్న టీవీ సోమనాథన్ గత నెలలో కేబినెట్ సెక్రటరీగా నియమితులైన నేపథ్యంలో ఈ ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ సెక్రటరీని ఆర్ధిక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉంటారు.
Admin
Studio18 News