Friday, 18 July 2025 06:32:44 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Rahul Gandhi: అమెరికాలో రాహుల్‌గాంధీకి ఆత్మీయ స్వాగతం

Date : 08 September 2024 02:03 PM Views : 142

Studio18 News - జాతీయం / : మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని డల్లాస్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు భారతీయ ప్రవాసులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐవోసీ) సభ్యులు ఆయనకు ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ ఫొటోలను షేర్ చేసిన రాహుల్.. డల్లాస్‌లో తనకు ఆత్మీయ స్వాగతం లభించినందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే అర్థవంతమైన చర్చలు, అంతర్ దృష్టితో కూడిన సంభాషణల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. నేడు డల్లాస్‌లో ఉండనున్న రాహుల్ రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. అంతకుముందు రాహుల్ పర్యటనపై ఐవోసీ చీప్ శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మీడియా, రాజకీయ నాయకులతో సహా భారతీయ ప్రవాసులు రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఉన్నారని, చర్చల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :