Tuesday, 03 December 2024 04:43:01 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Toll Free Entry: ముంబ‌యి వెళ్లే ఆ వాహ‌నాల‌కు నో టోల్ ఫీజు

Date : 14 October 2024 03:37 PM Views : 328

Studio18 News - జాతీయం / : దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి వెళ్లే లైట్ మోటార్ వాహ‌నాల‌కు (LMV) మ‌హారాష్ట్ర స‌ర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక‌పై ముంబ‌యిలోకి ప్ర‌వేశించే మొత్తం ఐదు టోల్ బూత్‌ల వ‌ద్ద లైట్ మోటార్ వాహ‌నాల‌కు టోల్ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని అక్క‌డి ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ్టి మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. నేటి అర్ధ‌రాత్రి నుంచే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ములుంద్‌, తిన్హంత్‌, ద‌హిస‌ల్‌, వాషి, ఐరోలిలోని టోల్ బూత్‌ల వ‌ద్ద ఎస్‌యూవీలు, కార్లు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించ‌కుండానే న‌గ‌రంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉండ‌నుంది. ప్ర‌స్తుతం ఈ టోల్ ప్లాజాల‌లో రూ. 45 రుసుము వ‌సూలు చేస్తున్నారు. కాగా, మ‌రికొన్ని రోజుల్లో మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ టోల్ ఫీజు మిన‌హాయింపు అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇంత‌కుముందు చాలాసార్లు టోల్ రుసుము వ‌సూళ్ల‌పై ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అప్పుడు మ‌హా స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి నో టోల్ ఫీజు అన‌డంతో ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ అంటూ విపక్షాలు దుయ్య‌బ‌డుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :