Thursday, 05 December 2024 09:29:22 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫోగ‌ట్‌, బజరంగ్ పునియా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ

Date : 04 September 2024 02:23 PM Views : 36

Studio18 News - జాతీయం / : Vinesh Phogat, Bajrang Punia : భారత రెజ్లర్లు వినేశ్ ఫోగ‌ట్‌, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. జులనా నియోజకవర్గం నుంచి వినేశ్ ఫోగ‌ట్‌, బద్లీ అసెంబ్లీ స్థానం నుంచి బజరంగ్ పునియా పోటీకి రెడీ అవుతున్నారు. ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఫోగ‌ట్, పునియా చేరిక కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారే అవకాశముంది. హర్యానా రైతులతో వినేశ్ ఫోగ‌ట్ మంచి అనుబంధం ఉంది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు ఆమె అండగా నిలిచారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు వినేశ్ ఫోగ‌ట్‌, బజరంగ్ పునియా నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు కాంగ్రెస్ లో చేరడం తమ పార్టీకి ప్లస్ అవుతుందని హైకమాండ్ భావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు.. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులకు సర్ది చెబుతున్నారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు కలికట్టుగా ఉండాలని ఆయన అంటున్నారు. మరోవైపు సీట్ల షేరింగ్ పై రెండు పార్టీలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అయితే ఏడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వబోమని కాంగ్రెస్ చెబుతోంది. ఇండియా బ్లాక్‌లో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క సీటు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అక్టోబర్ 5న ఎన్నికలు 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికలు వెలువడనున్నాయి. సెప్టెంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. సెప్టెంబర్ 12 వరకు నామినేషన్ల దాఖలు చేయవచ్చు. సెప్టెంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 16 వరకు ఈసీ గడువు విధించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :