Monday, 23 June 2025 03:18:51 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Rajya Sabha Bypolls: సెప్టెంబ‌ర్ 3న 12 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు

Date : 07 August 2024 04:49 PM Views : 126

Studio18 News - జాతీయం / : కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ 12 స్థానాల్లో 10చోట్ల జూన్‌లో లోక్‌స‌భకు ఎన్నిక‌వ్వ‌డంతో ఖాళీ అయ్యాయి. మ‌రో రెండింటీలో తెలంగాణ నుంచి ఒక‌టి (కే కేశ‌వ‌రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు), ఒడిశా నుంచి మ‌రోక‌టి ఖాళీ ఉన్నాయి. ఇలా 9 రాష్ట్రాల్లో 12 స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. అస్సాం, బీహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. వీటిలో అస్సాం నుండి సర్బానంద సోనోవాల్, హర్యానా నుండి దీపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ నుండి కెసి వేణుగోపాల్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్ ఉన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆగ‌స్టు 14న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు ఆఖ‌రు తేదీ ఆగ‌స్టు 21. అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, త్రిపుర రాష్ట్రాల‌కు చెందిన అభ్య‌ర్థులు ఈ నెల 26వ తేదీలోపు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అలాగే బీహార్, హ‌ర్యానా, రాజ‌స్థాన్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన అభ్య‌ర్థులు 27వ తేదీలోపు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునే వీలు ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :