Monday, 23 June 2025 03:00:31 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Kolkata: హంతకుడిని పట్టిచ్చిన హెడ్ సెట్

Date : 11 August 2024 11:58 AM Views : 125

Studio18 News - జాతీయం / : కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ (పీజీ మెడికల్ స్టూడెంట్) ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు. చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. దీంతో మెడికోలు, ట్రైనీ డాక్టర్లు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెడికోల ఆందోళనలతో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు. అదే ఆసుపత్రిలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోల్ కతా ఎస్పీ వినీత్ గోయల్ మీడియాకు వివరించారు. హత్యా స్థలంలో హెడ్ ఫోన్.. ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం చేస్తుండగా నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ హత్య చేశాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి ఒలకబోశాడు. అయితే, హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్ సెట్ దొరికింది. అది బాధితురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయుంటుందని పరిశోధన చేపట్టారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్ సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానించారు. ఇతరత్రా లభించిన ఆధారాలతో సంజయ్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించనట్లు సమాచారం. దీంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి, కేసును పకడ్భందీగా పుటప్ చేస్తున్నారు. నిందితుడికి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :