Wednesday, 16 July 2025 10:56:53 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Narendra Modi: అగ్నిపథ్ స్కీంపై విపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చిన ప్రధాని మోదీ

Date : 26 July 2024 12:27 PM Views : 140

Studio18 News - జాతీయం / : లడఖ్ లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ధ్వజమెత్తారు. అగ్నిపథ్ స్కీంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. దేశ రక్షణ, భద్రత వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశంపై విపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. "మన భద్రత బలగాలకు అవసరమైన సంస్కరణలకు అగ్నిపథ్ స్కీం ఒక ఉదాహరణ. మన భద్రతా బలగాల్లో ఎప్పుడూ యువ రక్తం నిండి ఉండాలని, ఏ సమయంలో అయినా యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని అనేక దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా విమర్శలు చేసేవాళ్లందరూ కూడా రక్షణ రంగ వ్యవస్థల్లో జరిగిన కుంభకోణాల్లో ఉన్నవారే. ఈ కుంభకోణాలే మన భద్రతా బలగాలను బలహీనంగా మార్చేశాయి. భారత వాయుసేన అధునాతన ఫైటర్ జెట్లను సమకూర్చుకోవాలని ఎన్నడూ కోరుకోని వ్యక్తులు కూడా వీళ్లే. దేశీయ యుద్ధ విమానం తేజాస్ ప్రాజెక్టును మూలన పడేయాలని భావించింది కూడా వీళ్లే. డబ్బును ఆదా చేయడానికే ప్రభుత్వం ఈ అగ్నిపథ్ స్కీం తీసుకువచ్చిందని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వీళ్లని నేను ఒక్కటే అడుగుతున్నా... సైనికుల పెన్షన్ అంశం 30 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. మేమే ఈ అంశాన్ని ఎందుకు తలకెత్తుకున్నాం? తర్వాత వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అని వదిలేయొచ్చు కదా! కానీ మేం అలా చేయలేదు... ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. దీన్ని మేం రాజకీయంగా భావించలేదు కాబట్టి చిత్తశుద్ధితో ఈ అంశాన్ని పరిశీలనకు తీసుకున్నాం. మా వరకు దేశ భద్రతకే ప్రథమ ప్రాధాన్యత" అని మోదీ స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :