Wednesday, 25 June 2025 06:39:39 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Sucide Attempt: ముంబై బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం..

Date : 17 August 2024 12:26 PM Views : 149

Studio18 News - జాతీయం / : ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. బ్రిడ్జి రెయిలింగ్ దాటుకుని కిందకు దూకుతుండగా చివరిక్షణంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. అప్పటికే అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి మహిళను కాపాడారు. శుక్రవారం సాయంత్రం అటల్ సేతు బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళ పేరు రీమా ముఖేశ్ పటేల్ అని, నార్త్ ఈస్ట్ ముంబైలోని ములంద్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. దూకడానికి ముందుగా రీమా తన చేతిలో ఉన్నదానిని సముద్రంలో పడేయడం వీడియోలో కనిపించింది. క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి, బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించడంతో రీమా ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితం విలువ గుర్తించాలి, పరిస్థితులు ఎలా మారినా ఇలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు’ అంటూ నగర పౌరులకు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :