Sunday, 25 January 2026 05:26:55 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

మహిళా కార్యకర్తను రాత్రిపూట పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లిన బీజేపీ నేత.. వీడియో ఇదిగో!

Date : 26 May 2025 12:28 PM Views : 289

Studio18 News - జాతీయం / : ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీనియర్ నేత ఒకరు మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారు. రాత్రిపూట పార్టీ ఆఫీసులో ఆయన చేసిన నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా స్పందించింది. సదరు నేతకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదంతా తనపై గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆ నేత వివరణ ఇచ్చుకున్నా రాష్ట్ర నాయకత్వం సంతృప్తి చెందలేదు. యూపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఈ ఘటన గోండా నగరంలో ఏప్రిల్ 12న జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రకారం.. బీజేపీ గోండా జిల్లా అధ్యక్షుడు అమర్ కిశోర్ కశ్యప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మెట్లపై నిలబడి ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. మరో వీడియోలో సదరు మహిళా కార్యకర్తను కశ్యప్ తన కారులో పార్టీ ఆఫీసుకు తీసుకురావడం, మెట్ల ద్వారా పైకి వెళ్లాలని సైగలు చేయడం కనిపిస్తోంది. ఈ వీడియో ఫుటేజీ ఆధారంగా జిల్లాకు చెందిన మరో నేత బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కశ్యప్ ప్రవర్తన పార్టీకి తలవంపులు తెస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోపై కశ్యప్ వివరణ.. సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ గా మారిన వెంటనే అమర్ కిశోర్ కశ్యప్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇదంతా తనపై ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. వీడియోలో కనిపిస్తున్నది మహిళ బీజేపీ కార్యకర్త అని, ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. విశ్రాంతి తీసుకుంటానని అడిగితే పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లానని తెలిపాడు. మెట్లు ఎక్కుతుండగా కళ్లు తిరిగి పడిపోబోతుంటే ఆమెకు సాయం చేశానని చెప్పుకొచ్చాడు. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటనకు తప్పుడు అర్థాలు తీస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కశ్యప్ మండిపడ్డాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :