Wednesday, 16 July 2025 10:40:19 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

శర్మిష్ఠ అరెస్టు... వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్

Date : 02 June 2025 05:26 PM Views : 54

Studio18 News - జాతీయం / : 'ఆపరేషన్ సిందూర్‌' సమయంలో సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్యలతో ఒక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలపై కోల్ కతా న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో, శర్మిష్ఠను తక్షణమే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. బార్ కౌన్సిల్ ఛైర్మన్ సూర్య ప్రకాశ్ ఖత్రి ఈ విషయంపై మాట్లాడుతూ, న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. శర్మిష్ఠ చేసిన పోస్ట్ వల్ల కొందరికి బాధ కలిగి ఉండవచ్చని, అయితే ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కూడా పోలీసులు ఈ రకమైన చర్యలు తీసుకోవడం సమంజసం కాదని సూర్య ప్రకాశ్ ఖత్రి అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న పోలీసులు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే, భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'పై బాలీవుడ్ ప్రముఖులు మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ శర్మిష్ఠ మే 14న సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తీవ్ర వివాదాస్పదంగా మారడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో శర్మిష్ఠ తన పోస్టులు, రీల్స్‌ను తొలగించి, క్షమాపణలు కోరారు. అయినప్పటికీ, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. కోల్‌కతా పోలీసుల చర్య భారతదేశంలోని వాక్‌స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని డచ్ దేశానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ సైతం 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో శర్మిష్ఠకు సహాయం చేయాలని ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ఈ పరిణామాలతో శర్మిష్ఠ అరెస్ట్ వ్యవహారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :