Thursday, 15 May 2025 02:22:50 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

BJP: బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీమంత్రి.. గంటల్లోనే బహిష్కరణ

Date : 11 August 2024 12:01 PM Views : 107

Studio18 News - జాతీయం / : బీజేపీలో చేరిన ఆరు గంటల్లోనే మాజీ మంత్రి ఒకరు బహిష్కరణకు గురయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెబల్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌కుమార్ శనివారం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే, పార్టీలో చేరడానికి ముందు ఆయన తన పూర్వాపరాలను దాచిపెట్టారని తెలియడంతో హర్యానా బీజేపీ విభాగం సందీప్‌కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ పునియా తెలిపారు. కాగా, కుమార్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర అధ్యక్షుడు రవిసోను కుండలి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2016లో ఆప్ నుంచి బహిష్కరణ ప్రస్తుతం బీజేపీ బహిష్కరించిన సందీప్‌కుమార్‌ను 2016లో ఆప్ బహిష్కరించింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సందీప్ ఓ మహిళతో అసభ్యకరంగా ఉన్న సీడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆ సీడీలో ఉన్న మహిళ ఆరోపించారు. ఇదే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. 2019లో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సందీప్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు తెలిపినందుకు అప్పటి శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అనర్హత వేటు వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :