Thursday, 05 December 2024 08:24:27 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Union Budget: బడ్జెట్ ప్రకటనలతో ధర పెరగనున్న, తగ్గనున్న వస్తువుల జాబితా ఇదే

Date : 23 July 2024 05:34 PM Views : 59

Studio18 News - జాతీయం / : కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రకటనలతో కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్ పేషెంట్లకు ఉపశమనం కల్పిస్తూ బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం మరో 3 క్యాన్సర్ చికిత్స ఔషధాలను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయిస్తోందని వెల్లడించారు. దీంతో క్యాన్సర్ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఛార్జర్లు, ఇతర మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక తోలుతో తయారు చేసిన వస్తువులు, సముద్రపు ఆహారాల ధరలు కూడా చౌకగా మారనున్నాయి. దేశీయంగా భారీ డిమాండ్ ఉన్న బంగారం, వెండి దిగుమతులపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్టు సీతారామన్ పేర్కొన్నారు. 10 నుంచి 6 శాతానికి సుంకం తగ్గించడంతో విలువైన ఈ రెండు మెటల్స్ ధరలు తగ్గనున్నాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో దేశీయంగా బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడనుందనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ నిరోధానికి కూడా ఈ ప్రకటన ఉపయోగపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక ప్లాటినమ్ దిగుమతులపై సుంకాన్ని 6.4 శాతానికి తగ్గిస్తున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంది. దీంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ధరలు పెరగనున్న వస్తువులు ఇవే.. పర్యావరణ హితం కోరుతూ కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్‌ సాధ్యంకాని ప్లాస్టిక్‌పై 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. టెలికం పరికరాల ధరలు కూడా పెరగనున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :