Studio18 News - జాతీయం / : డెడ్‌పూల్, వుల్వరైన్ మార్వెల్ కామిక్స్‌లను బేస్ చేసుకుని ఆయా పాత్రలతో అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. అవే పాత్రల వేషాలతో ముంబైలో ఇద్దరు ఫ్యాన్స్ దర్శనమిచ్చారు. ముంబై వానలో వర్సెస్ ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మార్వెల్ సూపర్‌హీరోల సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాస్ప్లేయర్‌లు ఆదిత్య, స్వరాజ్ కలేబెరే ఈ వేషాలు వేశారు. ఆదిత్య వుల్వరైన్‌గా, స్వరాజ్ డెడ్‌పూల్‌గా దుస్తులు వేసుకున్నారు. ‘డెడ్‌పూల్, వుల్వరైన్’ను ఎవరూ ఆపలేరని, చివరికి ముంబైలోకి ప్రవేశించకుండా వర్షాలు కూడా ఆపలేవని ఆదిత్య తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.‘డెడ్‌పూల్, వుల్వరైన్’ కలిసి ముంబై వానల్లో గొడుగులు పట్టుకుని వర్షంలో నిల్చున్నట్లు ఈ వీడియోలో ఉంది. గాలికి ఒక గొడుగు ఎగిరి పోతుండగా వుల్వరైన్ (స్వరాజ్) మరో గొడుగు కిందకు చేరినట్లు కనపడుతోంది.
Admin
Studio18 News