Monday, 23 June 2025 02:51:26 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Narendra Modi: బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 03 September 2024 11:53 AM Views : 115

Studio18 News - జాతీయం / : భారతీయ జనతా పార్టీ ఎన్నికల యంత్రం కాదని, ఎన్నికల్లో గెలుపు పార్టీ కార్యకర్తల కృషికి ఉప ఉత్పత్తి మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల యంత్రం అనే పదాన్ని ఆపాదించారని, పార్టీకి అంతకుమించిన అవమానం ఇంకొకటి లేదని ఆయన అన్నారు. ‘‘ మన పార్టీ కేవలం ఎన్నికల యంత్రం మాత్రమే కాదు. తోటి పౌరుల కలలను సాకారం చేసే పార్టీ మనది. జాతి కలలను తీర్మానాలుగా, ఆ తీర్మానాలను సాకారంగా మార్చే క్రమంలో మనల్ని మనం పూర్తిగా ఈ ప్రక్రియకే అంకితం చేసుకుంటున్నాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ‘సంఘటన పర్వ, సదస్యత అభియాన్ 2024'లను ప్రారంభించారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా పాల్గొన్నారు. అనేక మంది కార్యకర్తల జీవితాలు పెట్టుబడి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అనేక తరాల కార్యకర్తలు తమ జీవితాలను ఈ పార్టీకి పెట్టుబడిగా పెట్టారని, నేడు పార్టీ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాని మోదీ అన్నారు. ''సదస్యత అభియాన్' కార్యక్రమం మరోదఫా ప్రారంభమైంది. దేశంలో ఒక కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి భారతీయ జనసంఘ్ నుంచి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రజలు అధికారం కట్టబెట్టే సంస్థ లేదా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పాటించకుంటే, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే... ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు ఎదుర్కుంటున్న పరిస్థితే మనకూ వస్తుంది’’ అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :