Studio18 News - జాతీయం / : దేశం గర్వించదగ్గ నాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి నిన్న సాయంత్రం ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డాక్టర్ యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. భారత శాస్త్రీయ నృత్యంలో ఆమె ప్రావీణ్యం, కళపై ఆమెకున్న అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని కీర్తించారు. దేశ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మన ఘనతర వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేయడానికి అవిరళ కృషి చేశారని మోదీ వివరించారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Admin
Studio18 News