Thursday, 05 December 2024 04:13:10 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Ujjain Shops: ఉజ్జయినిలోని హోటల్ యజమానుల నేమ్ ప్లేట్ తప్పనిసరి

Date : 21 July 2024 02:20 PM Views : 77

Studio18 News - జాతీయం / : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల బాటలో మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరం ఉజ్జయినిలో హోటళ్లు, తినుబండారాల స్టాల్స్, తోపుడుబళ్ల నిర్వాహకులు తమ పేర్లను వెల్లడిస్తూ బోర్డులు తగిలించాలని ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్ లో యజమాని పేరుతో పాటు క్యూఆర్ కోడ్, ఫోన్ నెంబర్ పేర్కొనాలని చెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించడంతో పాటు సదరు హోటల్, స్టాల్, తోపుడు బళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. కన్వర్ యాత్ర సాగే మార్గంలో పలువురు హిందూయేతరులు హిందూ పేర్లతో షాపులు నిర్వహిస్తున్నారని, భక్తులకు మాంసాహారంతో చేసిన పదార్థాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే బాటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా ఆదేశాలు జారీ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :