Studio18 News - జాతీయం / : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయ్‌బరేలీ నుంచి 60 మంది ప్రయాణికులతో బస్సు ఢిల్లీ వెళ్తుండగా లక్నో-ఆగ్రా జాతీయ రహదారిపై ఇటావా జిల్లాలోని ఉస్రహార్ ప్రాంతంలో గత రాత్రి జరిగిందీ ఘటన. వేగంగా వెళ్తున్న బస్సు రాంగ్‌రూట్‌లో వస్తున్న కారును ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని ప్రాథమింకగా తేల్చారు. లక్నో నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని రాంగ్‌రూట్‌లోకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. కారును ఢీకొట్టిన బస్సు బోల్తాకొట్టింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News