Wednesday, 25 June 2025 07:52:07 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

మహారాష్ట్ర థానేలో తృటిలోతప్పిన పెనుప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన హోర్డింగ్.. వీడియో వైరల్

Date : 02 August 2024 02:19 PM Views : 167

Studio18 News - జాతీయం / : Maharashtra : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. థానే ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయింది. అక్కడేఉన్న ప్రజలు భయంతో పక్కకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. థానేలోని కళ్యాణ్‌లోని సహజానంద్ చౌక్ వద్ద శుక్రవారం ఉదయం 10.18గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోర్డింగ్ పడిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం పడుతుండటంతో వాహనదారులు పక్కనే ఉన్న దుకాణం వద్ద వేచిఉన్నారు. వాహనాలు రోడ్డుపక్కన పార్కింగ్ చేసి వర్షంకు షాపు వద్ద తలదాచుకున్నారు. ఈ సమయంలో బిల్డింగ్ పై ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడేఉన్న ఆటోపైన, పార్కింగ్ చేసిన వాహనాలపై పడింది. హోర్డింగ్ కొంతభాగం ఆటోపై పడింది. ఆ ఆటోలో ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే, హోర్డింగ్ పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ బరువు తక్కువగా ఉండటంతో ఆటోలోని ప్రయాణికులకు ప్రమాదం తప్పినట్లంది. అదే సమయంలో అటువెళ్తున్న విద్యార్థికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. హోర్డింగ్ పడేసమయంలో అక్కడేఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పలు వాహనాలు ధ్వంసం అయినట్లు థానే అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘాట్ కోర్ వద్ద ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి సుమారు 17మంది వరకు మృతిచెందిన విషయం తెలిసిందే. అకాల వర్షం కురవడంతో వర్షానికి తడవకుండా ఉండేందుకు పెట్రోల్ బంక్ పక్కన వాహనదారులు వేచిఉన్నారు. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు రావడంతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దీంతో హోర్డింగ్ కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. 14మందికి గాయాలయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :