Monday, 23 June 2025 02:11:49 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Rajasthan: రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారిని అపహరించి యువకుడి అత్యాచారం..

Date : 20 August 2024 03:29 PM Views : 127

Studio18 News - జాతీయం / : కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు ఎలాంటి భీతి లేకుండా నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెదవులపై గాట్లు ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్టు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికను ఎత్తుకెళ్తుండడం సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వలస వచ్చి జోధ్‌పూర్‌లోని ఓ మురికివాడలో ఉంటున్నట్టు తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వివరించారు. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :