Sunday, 08 February 2026 10:22:04 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Kolkata Horror: కోల్‌కతా హారర్.. వైద్యురాలిపై హత్యాచారానికి కొన్ని గంటల ముందు జరిగింది ఇదే!

Date : 24 August 2024 12:27 PM Views : 412

Studio18 News - జాతీయం / : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనలో అసువులు బాసిన వైద్యురాలితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) నిర్వహించేందుకు సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్ టెస్టులో వైద్యురాలి చివరి గంటల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. 31 ఏళ్ల బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత వైద్యురాలితో కలిసి ఘటన జరగడానికి ముందు డిన్నర్ చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి వాంగ్మూలాలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వైద్యురాలు హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత తొలుత చూసింది కూడా వీరే. సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడానికి వీరేమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని సీబీఐ భావిస్తోంది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన ఆసుపత్రి మూడో అంతస్తులోని సెమినార్ రూములో ఈ నలుగురిలో ఇద్దరి వేలిముద్రలను సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన సమయంలో ఉదయం 10.53 గంటల నుంచి 11.15 గంటల మధ్య ఏం జరిగిందనేది సీబీఐకి మిస్టరీగా మారింది. బాధిత కుటుంబానికి తొలుత ఫోన్ చేసినప్పుడు వైద్యురాలు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు. ఆ తర్వాత 11.15 గంటలకు రెండోసారి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ 22 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది తెలుసుకోవాలని భావిస్తున్న సీబీఐ పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి పొందింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :