Studio18 News - జాతీయం / : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇవ్వకుండా ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. ఇలాగైతే మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎలా అని ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో చిరు వ్యాపారులు బతికేది ఎలాగని నిలదీస్తున్నారు. ఉద్యోగ కల్పన అనేది మాటలకే పరిమితమా? ఉద్యోగులకు పన్నుల్లో ఇక ఊరట దక్కదా? అంటూ కన్నీరు పెడుతున్నట్లు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, బిహార్‌లోని ఎన్డీఏ పార్టీల వల్ల కేంద్ర సర్కారు నిలబడుతోందని, అక్కడి భాగస్వామ్య పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే కుప్పకూలుతుందని భయపడి ఆ రాష్ట్రాలకు భారీగా నిధులు ఇచ్చారని ఫన్నీగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను పోల్చితే రెండు కొండల పక్కన చీమలు నిలబడినట్లు ఉందని అన్నారు.
Admin
Studio18 News