Saturday, 17 January 2026 09:09:13 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Narendra Modi: వయనాడ్‌లో వారిని చూసి చలించిపోయిన ప్రధాని మోదీ... బెయిలీ వంతెనపై నడక

Date : 10 August 2024 04:19 PM Views : 332

Studio18 News - జాతీయం / : వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ కాల్‌పేటలో అడుగిడిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్‌లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు. వారిని చూసిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది పిల్లలు చనిపోయారని ఉద్వేగపూరిత గొంతుతో అడిగారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ స్కూల్ భవనం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న పాఠశాల భవంతిని, అక్కడున్నవారిని చూసి చలించిపోయారు. బాధితుల పునరావాసం గురించి అడిగి తెలుసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో జీవీహెచ్ఎస్ వెల్లర్మల స్కూల్లో 582 మంది విద్యార్థులు ఉండగా ఇందులో 27 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ పాఠశాలలో ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. బెయిలీ వంతెనను సందర్శించిన మోదీ ప్రధాని మోదీ భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించారు. ఈ వంతెన గుండా నడిచి, రక్షణ అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆసుపత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరాయి విజయన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :