Studio18 News - జాతీయం / : Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు. పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.
Admin
Studio18 News