Sunday, 08 March 2026 10:02:15 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Bengaluru Airport: ఎయిర్‌పోర్ట్ వెలుపల వేచిచూసి.. మాజీ భార్య ప్రియుడు బయటకు రాగానే..!

Date : 29 August 2024 10:57 AM Views : 402

Studio18 News - జాతీయం / : బెంగళూరు మహానగరంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ వెలుపల బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన మాజీ భార్య ప్రియుడిని కిరాతకంగా హత్య చేశాడు. ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి కోసం చాలా సేపు ఎదురుచూసిన నిందితుడు.. అతడు బయటకు వచ్చిన వెంటనే పదునైన కత్తితో గొంతు కోశాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఉద్యోగి మృతి చెందాడు. నిందితుడు పదునైన కత్తిని దాచిపెట్టి.. బస్సులో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నాక హత్య చేయాలనుకున్న వ్యక్తి బయటకు వచ్చే వరకు వేచి చూశాడు. తన మాజీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. కాగా హత్య అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతదేహం రక్తంతో తడిసిపోవడం వీడియోలో కనిపించింది. కాగా నిందిత వ్యక్తి, అతడి మాజీ భార్య 2022లో విడిపోయారు. హత్యకు గురైన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే వీరిద్దరి మధ్య గొడవలకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మాజీ భార్య ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని చంపేందుకు నిందితుడు గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :