Monday, 23 June 2025 02:46:36 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Viral Video: అమ్మాయితో వెళ్తూ.. 140 స్పీడుతో కారును నడిపి బైకును గుద్ది పడేసిన సోషల్ మీడియా స్టార్

Date : 30 August 2024 05:50 PM Views : 123

Studio18 News - జాతీయం / : ఓ సోషల్ మీడియా స్టార్ 140 స్పీడుతో కారును నడిపి బైకును గుద్ది పడేసి, ఆగకుండా దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి అతడి పక్కనే ఉంది. మెల్లిగా వెళ్లాలని అతడికి ఆమె చెబుతున్నా అతడు వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. ఫిట్‌నెస్ ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ రజత్ దలాల్ పాల్పడ్డ ఈ చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రజత్ పై గతంలోనూ ఓ కేసు ఉంది. ఇటీవల అతడు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అతి వేగంగా కారు నడుపుతూ వెళ్లాడు. అతడి పక్కన ఓ అమ్మాయి, వెనుక సీట్లో మరో ప్రయాణికుడు కూర్చుకున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డు చేశాడు. రద్దీగా ఉండే హైవే గుండా నిర్లక్ష్యంగా కారును డ్రైవింగ్ చేస్తూ దలాల్ 143 కి.మీ.వేగంతో కారును నడిపాడు. ఆ సమయంలో ఓ బైకుని ఢీకొట్టినప్పుడు పెద్ద చప్పుడు వినిపించింది. ‘‘సర్, సర్.. సర్.. అతను కింద పడిపోయాడు, దయచేసి ఇంత వేగం వద్దు’’ అని పక్కనే కూర్చున్న అమ్మాయి అనడం వీడియోలో వినపడింది. అతను పడిపోయినా ఫర్వాలేదంటూ రజత్ దలాల్ ఏ మాత్రం పట్టించుకోకుండా అదే వేగంగా ముందుకు దూసుకుపోయాడు. రజత్ దలాల్‌కు ఫరీదాబాద్ పోలీసులు చలాన్ జారీ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :