Sunday, 25 January 2026 06:26:16 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Rahul Gandhi: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Date : 01 August 2024 06:21 PM Views : 335

Studio18 News - జాతీయం / : వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నానన్నారు. బాధితులకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. తానొక్కడినే కాదని... ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు. ఇది హృదయాన్ని కదిలిస్తోందన్నారు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే తాను వచ్చానన్నారు. చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయారు... ఇళ్లనూ పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. తమవంతు సాయం కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు సాయం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తనకు నోట మాట రావడం లేదని ప్రియాంకగాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :