Studio18 News - జాతీయం / : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే, చాలా మందికి గాయాలయ్యాయి.. వందలాది మంది కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్న దృశ్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. వయనాడ్ దుర్ఘటన వల్ల మూగజీవాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. ఇంట్లో పిల్లల్లా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను కూడా చాలా మంది కోల్పోయారు. తాజాగా, ఓ కుక్కకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కొండచరియలు విరిగిపడడంతో తప్పిపోయిన ఓ కుక్క ఆరు రోజుల తర్వాత తన యజమానిని చూసింది. ఆ కుక్క యజమానికి భావోద్వేగానికి గురై దాన్ని హత్తుకుంది. ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా చూశారు. కాగా, కొండచరియలు విరిగిపడి కుటుంబాలను కోల్పోయిన వారికి ప్రభుత్వం సాయం చేస్తోంది.
Admin
Studio18 News