Studio18 News - జాతీయం / : బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. అద్వానీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో, ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఇంద్రప్రస్థలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రి న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. గత నెలలోనూ అద్వానీ ఆరోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండ్రోజుల పరిశీలనలో ఉంచిన వైద్యులు, ఆపై ఆయనను డిశ్చార్జి చేశారు. ఇటీవల కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఇటీవల కాలంలో తరచుగా అనారోగ్యం బారినపడుతున్నారు.
Admin
Studio18 News