Monday, 16 September 2024 07:19:21 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Kolkata Doctor: పోలీసులపై కోల్ కతా వైద్యురాలి పేరెంట్స్ సంచలన ఆరోపణలు

Date : 05 September 2024 12:04 PM Views : 22

Studio18 News - జాతీయం / : కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్ తో వైద్యురాలికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు మృతదేహాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని, చాలాసేపు పోలీస్ స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని ఆరోపించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నపుడు కూడా తమను పోలీస్ స్టేషన్ నుంచి కదలనివ్వలేదని మండిపడ్డారు. కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఆఫర్ చేశారని, మేం వెంటనే తిరస్కరించామని వైద్యురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఆమెకు న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా తాము పాల్గొన్నామని వివరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దారుణ హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం జరగాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :