Studio18 News - జాతీయం / : వారంలో పెళ్లి ఉందనంగా ఓ యువకుడు అనూహ్య రీతిలో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానమైన అతడు ఊహించని విధంగా నిద్రలోనే తుదిశ్వాస విడిచి కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన కంచుగట్ల శంకరయ్య, పద్మ దంపతులకు శివ (25) ఏకైక సంతానం. తల్లిదండ్రులతోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. గత నెల 18న బంధువుల అమ్మాయితో శివకు వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి దుస్తులు కొనుగోలు చేయాలనుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే కుమారుడిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు ఎంత ప్రయత్నించినా అతడిలో చలనం లేకపోవడంతో చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
Admin
Studio18 News