Wednesday, 25 June 2025 07:26:19 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Wayanad Landslides : వయనాడ్ విలయం.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం ఫైర్

Date : 01 August 2024 11:30 AM Views : 148

Studio18 News - జాతీయం / : Wayanad Landslides : కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మండక్కై, చూరాల్‌మ‌ల‌ ప్రాంతాల్లో ఇప్పటివరకు 200 మందికిపైగా మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. ఇంకా వందకుపైగా స్థానికుల ఆచూకీ దొరలేదు. వారికోసం వెతుకులాట కొనసాగుతోంది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ కు చెందిన నాలుగు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే, మండకై నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నీటిమట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఉత్తర కేరళలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మండక్కై జంక్షన్, చూరాల్‌మ‌ల‌ పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. చూరాల్‌మ‌ల‌ పట్టణంలో తమ కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారని జయన్ అనే వ్యక్తి కన్నీటిపర్యాంతమయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదు. ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద వస్తున్న శబ్దం వినిపించింది. ఆప్పుడు సమయం 3.30 అయింది. నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. అప్పుడే కరెంట్ పోయింది. గంటల సమయంలోనే ఇళ్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి. రాళ్లు వచ్చిపడ్డాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నదిలా మారిపోయింది. ఈ ఘటనలో తన భార్య తరపు 11 మంది కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పాడు. అమిత్ షా వర్సెస్ కేరళ సీఎం .. రెండు రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 219 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. అయితే, కేంద్రమంత్రి అమిత్ షా వాఖ్యలను ఆయన ఖండించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి ప్రజలను వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారని అన్నారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25వ తేదీన రెండు సార్లు హెచ్చరికలు పంపాం. 20 సెంటీమీటర్ల భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. అయినా స్థానికులను ఎందుకు తరలించలేదని కేరళ ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీ వరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం 6గంటలకు రెడ్ అలర్ట్ ను పంపించారని అన్నారు. ఇవాళ రాహుల్ పర్యటన.. కొండచరియల విరిగిపడిన ఘటనలో మండక్కై, చూరాల్ మల పట్టణం పూర్తిగా దెబ్బతింది. మండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయి. విధ్వంసం తరువాత 450 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇదిలాఉంటే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. సీఎం పినరయు విజయన్ తో కలిసి మెప్పాడి ప్రాంతంలో సహాయక శిబిరాల్లో వరద బాధితులను వారు పరామర్శించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :