Sunday, 08 March 2026 04:26:54 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

Date : 06 August 2024 10:51 AM Views : 2717

Studio18 News - జాతీయం / : sheikh hasina : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్నిరోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హాసీనా రాజీనామా చేసింది. ఆ తరువాత ఆమె దేశం విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఆమె భారత్ లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. యూకే ను హసీనా ఆశ్రయం కోరింది. ఆ అనుమతులు వచ్చే వరకు భారతదేశంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే, ఆమె ఎన్నిరోజులు భారత్ లో ఉంటుందనే అంశంపై స్పష్టత లేదు. యూకే నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా భారత్ లోనే ఉంటారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమతి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్ డమ్ అభిప్రాయపడింది. అమెరికా కూడా స్పందించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన దేశాలు కూడా బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :