Monday, 23 June 2025 02:45:42 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

బలవంతం చేయొద్దు.. సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Date : 22 July 2024 03:25 PM Views : 146

Studio18 News - జాతీయం / : Supreme Court : కన్వర్ యాత్ర – నేమ్ ప్లేట్ వివాదం కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరప్రదేశ్ సహా మరో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. దుకాణాలపై దుకాణదారులు పేర్లు, గుర్తింపులను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. హోటళ్ల నిర్వాహకులు నేమ్ ప్లేట్లు ప్రదర్శించాలనే నిబంధనపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. యాజమానులు, విక్రయదారుల పేర్లను వెల్లడించమని బలవంతం చేయొద్దని ప్రభుత్వాలకు కోర్టు సూచించింది. దుకాణందారుడు వారి దుకాణంలో ఎలాంటి ఆహారం విక్రయిస్తున్నాడో మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్ లను అమర్చాలని యూపీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిపిందే. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. ఓ స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పిటీషన్ దాఖలైయ్యాయి. ఈ పిటీషన్లపై సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసుపై విచారణ సందర్భంగా న్యాయవాది సీయూ సింగ్ మాట్లాడారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి చట్టపరమైన హక్కు లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. రోడ్డు పక్కన టీ స్టాల్, వీధి వ్యాపారులు నేమ్ ప్లేట్లను అమర్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని సీయూ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మైనార్టీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని పేర్కొన్నారు.సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్యపెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇవి. నేమ్ ప్లేట్స్ ప్రదర్శిచకుండా ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా.. తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్లకు వెళ్తాం. నేమ్ బోర్డు ఏర్పాటు ద్వారా ఓ వర్గాన్ని గుర్తింపు బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అభిషేక్ సింఘ్వీ కోర్టు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :