Studio18 News - జాతీయం / : Snake vs Mongooses : పాము, ముంగిస బద్ద శత్రువులనే విషయం మనందరికీ తెలిసిందే. ఆవి ఎదురుపడ్డాయంటే అక్కడ పెద్ద యుద్ధం జరగాల్సిందే. పాము, ముంగిస కొట్లాట గురించి మనం తరచూ విటుంటాం. కానీ, చూడటం మాత్రం చాలా అరుదు. తాజాగా పాముపై మూడు ముంగిసలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మూడు ముంగిసలు ఒకేసారి పాముపై దాడికి దిగాయి. వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రం పాట్నా విమానాశ్రయంలోని రన్ వేపై మూడు ముంగిసలు ఓ పాముపై దాడికి దిగాయి. మొదట.. ఓ ముంగిస పాము మధ్య ఘర్షణ జరిగింది. అదే సమయంలో మరో రెండు ముంగిసలు అక్కడికి చేరుకున్నాయి. మూడు ముంగిసలు కలిసి పాముపై దాడికి చేయడం ప్రారంభించాయి. వాటిని దాడి నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, చివరికి పామును ముంగిసలు ఏం చేశాయి.. పాము వాటి నుంచి తప్పించుకుందా..? వాటి చేతిలో చావుదెబ్బ తిందా అనే విషయం తెలియకముందే వీడియో పూర్తయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు పాము, ముంగిసలు కొంత ఆహ్లాదకరమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాయని పేర్కొన్నారు, మరికొందరు నెటిజన్లు ఇది వాటి మధ్య నిజమైన పోరాటం అని పేర్కొంటున్నారు.
Admin
Studio18 News