Saturday, 07 March 2026 09:18:35 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Nursing Student: మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Date : 27 August 2024 05:17 PM Views : 475

Studio18 News - జాతీయం / : మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ నర్సింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి తెగబడ్డాడు. ఓవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 24న జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాటల్లో పెట్టి మత్తు మందిచ్చి... రత్నగిరిలో ఓ నర్సింగ్ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. అటుగా వచ్చిన ఆటోలో ఎక్కింది. ఒక్కతే ప్రయాణిస్తుండడంతో ఆటో డ్రైవర్ మంచిగా మాటలు కలిపాడు. తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అయితే, అందులో అప్పటికే మత్తు మందు కలిపాడు. దాహంగా ఉండడంతో ఈ విషయం గుర్తించని విద్యార్థిని ఆ నీళ్లను తాగింది. కాసేపటికే స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత గాయాలపాలైన యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అఘాయిత్యం జరిగిందని గుర్తించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి కుటుంబంతో పాటు డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :