Monday, 23 June 2025 03:02:34 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Advocate gangadharan srory: మూడు దశాబ్దాలకు కల నెరవేరింది ..ప్లీడర్ గుమాస్తా విజయగాథ

Date : 22 August 2024 02:43 PM Views : 129

Studio18 News - జాతీయం / : అతను ఒక సాధారణ ప్లీడర్ గుమాస్తా .. కానీ అతనికి లా కోర్సు పూర్తి చేసి నల్ల కోటు వేసుకుని న్యాయవాదిగా కేసులను వాదించాలని బలమైన కోరిక ఉండేది. అయితే అతని కోరిక నెరవేర్చుకునేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. కలను సాకారం చేసుకోవాలన్న తపనకు పట్టుదల తోడు అవ్వడంతో అతను తాను అనుకున్నది సాధించాడు. ఇది న్యాయవాదిగా మారిన ఓ ప్లీడర్ గుమాస్తా విజయ గాథ. విషయంలోకి వెళితే.. కేరళ రాష్ట్రం కోసర్‌గోడ్ లోని కోజువల్ పల్లియానికి చెందిన గంగాధరన్ 1992లో కోర్టులో ప్లీడర్ గుమాస్తాగా చేరాడు. అప్పటి నుండి పలువురు న్యాయవాదుల వద్ద గుమాస్తాగా పని చేస్తూ వచ్చాడు. అప్పటి నుండే న్యాయవాది కావాలని గంగాధరన్ అనుకున్నాడు. కానీ పలు పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాడు. దీంతో అతని కోరిక అలానే ఉండిపోయింది. అయితే 2019లో కాన్నూర్ యూనివర్శిటీ నుండి మలయాళంలో బీఏ పూర్తి చేసిన గంగాధరన్ .. ఆ తర్వాత సుల్కాలోని కేవిజీ లా కళాశాలలో ఎల్ఎల్ బీ చేరాడు. ఆ సమయంలోనూ ఓ న్యాయవాది వద్ద గుమాస్తాగా గంగాధరన్ పని చేస్తూనే ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. ఇటీవలే కోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. 52 ఏళ్ల వయసులో నల్ల కోటు ధరించి తను గుమాస్తాగా పనిచేసిన న్యాయస్థానంలోనే న్యాయవాదిగా గంగాధరన్ ప్రాక్టీసు చేస్తున్నాడు. గంగాధరన్ పట్టుదలతో ప్లీడర్ గుమాస్తా నుండి ప్లీడర్ గా ఎదిగిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. చదువుకు వయసుతో పని లేదని కల నెరవేర్చుకోవాలన్న పట్టుదల, కృషి ఉంటే సరిపోతుందని గంగాధరన్ నిరూపించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :