Studio18 News - జాతీయం / : UPSC Chairman Preeti Sudan : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సూదన్ నియమితులయ్యారు. యూపీఎస్సీ సెక్రటరీ బుధవారం విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల రాజీనామా సమర్పించిన డాక్టర్ మనోజ్ సోనీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అతని స్థానంలో ప్రీతి సూడాన్ ను కమిషన్ చైర్మన్ గా రాష్ట్రపతి ఆమోదించారని యూపీఎస్సీ సెక్రటరీ లేఖలో పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సూదన్ ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా 2025 ఏప్రిల్ 29వ తేదీ వరకు చైర్మన్ హొదాలో కొనసాగనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ కు చెందిన అధికారిణి. యూపీఎస్సీ సభ్యురాలిగా 2022 నుంచి ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Admin
Studio18 News